
తెలంగాణ విమోచన దినం పేరుతో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరవ్వనున్నారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు 16వ తేదీ సాయంత్రమే హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. 17వ తేదీ ఉదయం జాతీయ పతాకం ఎగురవేసి సైనిక వందనాన్ని స్వీకరిస్తారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన కావడంతో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
ఆ తర్వాత పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు షా. హైదరాబాద్ సంస్థానం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధులు లేదా వారి కుటుంబసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మదినం కూడా కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే సేవా కార్యక్రమాల్లో అమిత్‌షా పాల్గొంటారు. ఇందులో భాగంగా వికలాంగులు, ఇతర వర్గాలకు ఉపయోగపడే అంబులెన్స్‌ల అందజేత, దివ్యాంగులకు మోటార్‌సైకిళ్లు, ట్రైసైకిళ్ల పంపిణీ, వివిధ హాస్టళ్లవారికి మరుగుదొడ్లను శుభ్రం చేసే ప్రత్యేక పరికరాలు, యంత్రాలు అందజేస్తారు.
ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న బీజేపీ నేత అమిత్ షా, ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్ర నచ్చడంతో తారక్‌ను పర్సనల్‌గా పిలిచి షా అభినందించారు షా. ఇక ఆ తరువాత నితిన్‌ను బీజేపీ నేత జేపీ నడ్డా పర్సనల్‌గా పిలిపించుకొని మాట్లాడారు. అయితే ఇందులో చిన్న పొరపాటు జరిగిందని, నిఖిల్‌కు బదులు నితిన్‌ను పిలిచారని కన్ప్యూజ్ సృష్టించారు. అందులో నిజమెంత అనేది ఇప్పటివరకు తెలియదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి అమిత్ షా, నిఖిల్ తో భేటీ అవ్వడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.