Homeటాప్ స్టోరీస్సునీల్ హీరోయిన్ హాట్‌ బుక్ రీడింగ్ షో

సునీల్ హీరోయిన్ హాట్‌ బుక్ రీడింగ్ షో

సునీల్ హీరోయిన్ హాట్‌ బుక్ రీడింగ్ షో
సునీల్ హీరోయిన్ హాట్‌ బుక్ రీడింగ్ షో

బుక్ రీడింగ్ సునీల్ హీరోయిన్ మ‌న్నారా ని చూసి నేర్చుకోవాలేమో. `ప్రేమా గీమా జాన్తానై` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత సునీల్ న‌టించిన `జ‌క్క‌న్న‌`తో హీరోయిన్‌గా గుర్తింపుని సొంతం బ‌చేసుకుంది. పూరి `రోగ్` మూవీతో అందాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు సంకేతాలిచ్చింది.

కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో మాత్రం అవ‌కాశాల్ని ద‌క్కించుకోలేక‌పోతోంది. బాలీవుడ్‌లో ఎరోటిక్ థ్రిల్ల‌ర్ `జిద్‌`లో అందాలు ఆర‌బోసి సంచ‌ల‌నం సృష్టించింది. కానీ క్రేజీ ఆఫ‌ర్ల‌ని మాత్రం సొంతం చేసుకోలేక సెకండ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. కాజ‌ల్ న‌టించిన `సీత‌`లో ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్ర‌లో న‌టించి ఫేడ‌వుట్ అయిపోయింది.

- Advertisement -

చేతిలో సినిమాలు లేక‌పోవ‌డం, లాక్‌డౌన్ కార‌నంగా ఇంటి ప‌ట్టునే వుంటూ కాల‌క్షేపం చేస్తోంది. సినిమాల్లో త‌న ప్ర‌తాపం చూపించే అవ‌కాశం ద‌క్క‌క‌నోవ‌డంతో సోష‌ల్ మీడియాని హీటెక్కించే కార్య‌క్ర‌మం పెట్టుకుంది. హాట్ హాట్ పిక్స్‌తో ప‌ల‌క‌రించే మ‌న్నారా తాజాగా బుక్ రీడింగ్ చేస్తూ వివిధ భంగిమ‌ల్లో ఫొటోల‌కు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలిప్పుడు ఇంట‌ర్నెట్ ని హీటెక్కిస్తున్నాయి. బుక్ రీడింగ్ పేరుతో సునీల్ హీరోయిన్ చేస్తున్న గ్లామ‌ర్ షోపై నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బుక్ రీడింగ్ నిన్ను చూసి నేర్చుకోవాలి మ‌న్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All