HomeUncategorizedచిరంజీవి నన్ను పక్కకు తప్పుకోమన్నారు - విష్ణు

చిరంజీవి నన్ను పక్కకు తప్పుకోమన్నారు – విష్ణు

చిరంజీవి నన్ను పక్కకు తప్పుకోమన్నారు - విష్ణు
చిరంజీవి నన్ను పక్కకు తప్పుకోమన్నారు – విష్ణు

మంచు విష్ణు ఇటీవలే ముగిసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రెసిడెంట్ కుర్చీని ఎక్కిన విషయం తెల్సిందే. ప్రెసిడెంట్ అయిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ లో మీడియాతో పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు మంచు విష్ణు. ముందుగా ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేద్దామని అనుకున్నారు పెద్దలు. ప్రకాష్ రాజ్ గారు పోటీగా నిలబడ్డారని తెలుసు. ఇప్పుడు చెప్పొచ్చో లేదో, ఎన్నికలు ముగిసి అంతా అయిపోయింది కాబట్టి చెప్పొచ్చని అనుకుంటున్నా.

చిరంజీవి గారు నాన్నకు ఫోన్ చేసి ఎన్నికలను ఏకగ్రీవం చేద్దాం, మంచు విష్ణును పక్కకు తప్పుకోమని అన్నారు కానీ మేము ఎన్నికలకు వెళదామని నిర్ణయించుకున్నాం. అలాగే రామ్ చరణ్ ఎవరికి ఓటు వేశారు అన్నదానిపై ఎటువంటి సందేహం అక్కర్లేదు. నేను కూడా నాన్న మాట జవదాటను. అలాగే చరణ్ కూడా. చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ కాబట్టి చరణ్ కూడా ఆయనకే ఓటు వేసి ఉంటాడు. కానీ మేమంతా ఒకటే, చరణ్ నాకు ఇప్పటికే సోదరుడే అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అలాగే తారక్ ఎన్నికలకు దూరంగా ఉండడం తన పర్సనల్ ఛాయస్. కానీ నేను గెలిచిన తర్వాత నాకు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది తారక్ నుండే. మేమంతా ఒక్కటే అని అభిప్రాయపడ్డాడు. అలాగే నాగబాబు, ప్రకాష్ రాజ్ రాజీనామాలను ఆమోదించబోయేది లేదని వాళ్ళ మార్గదర్శకం నాకు కావాలి అని తెలిపాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All