Homeటాప్ స్టోరీస్మంచు ల‌క్ష్మీతో క‌లిసి ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌!

మంచు ల‌క్ష్మీతో క‌లిసి ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌!

మంచు ల‌క్ష్మీతో క‌లిసి ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌!
మంచు ల‌క్ష్మీతో క‌లిసి ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌!

మంచు ల‌క్ష్మి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఇద్ద‌రూ ప్ర‌త్యేకంగా ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఒక‌రంటే ఒక‌రంటూ నాటీపోజులిస్తూ పోటీప‌డ్డారు. ర‌కుల్ స్లీవ్‌లెస్ టాప్ ధ‌రించి సెగ‌లు పుట్టించ‌గా.. మంచు ల‌క్ష్మీ మాత్రం ట్రెండీ వేర్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ ఇద్ద‌రికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మంచు ల‌క్ష్మీ, ర‌కుల్ మంచి స్నేహితులు.

ఇద్ద‌రు క‌లిసి వెకేష‌న్‌కి వెళ్ల‌డం.. డివోష‌న‌ల్ టూర్స్ వెల్ల‌డం అప్పుడ‌ప్పుడు చేస్తుంటారు. మంచు మ‌నోజ్‌‌తో ర‌కుల్ `క‌రెంట్ తీగ‌` చిత్రంలో న‌టించింది. అక్క‌డి నుంచి మంచు ల‌క్ష్మీతో ర‌కుల్ కు మంచి అనుబంధం ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌రకు వీరి స్నేహ బంధం అలాగే కొన‌సాగుతోంది. ర‌కుల్  హైద‌రాబాద్ వ‌చ్చిందంటే మంచు ల‌క్ష్మితో ట‌చ్‌లోకి వెళ్లాల్సిందే. అంత‌లా వీరి మ‌ధ్య అనుబంధం పెరిగిపోయింది.

- Advertisement -

గ‌తంలో బాలీవుడ్ డ్ర‌గ్ స్కాండ‌ల్‌కి సంబంధించిన ర‌కుల్ పేరు వినిపించిన సంద‌ర్భంలో నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తుంటే వారికి ధీటుగా స‌మాధానం చెప్పి ర‌కుల్‌కు అండ‌గా నిలిచింది మంచు ల‌క్ష్మి. ఇదిలా వుంటే ర‌కుల్ ప్రీత్‌సింగ్ ప్ర‌స్తుతం త‌మిళంలో శివ‌ కార్తికేయ‌న్‌తో క‌లిసి `అయాల‌న్‌`, క‌మ‌ల్‌తో `ఇండియ‌న్ 2` వైష్ణ‌వ్ తేజ్‌తో క్రిష్ తెర‌కెక్కించిన చిత్రంతో పాటు హిందీలో మేడే, ఎటాక్‌, థాంక్ గాడ్ చిత్రాల్లో న‌టిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All