Homeటాప్ స్టోరీస్డీ గ్లామర్  పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్‌సింగ్!

డీ గ్లామర్  పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్‌సింగ్!

డీ గ్లామర్  పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్‌సింగ్!
డీ గ్లామర్  పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్‌సింగ్!

గ్లామ‌ర్ డాల్ పాత్ర‌ల్లో న‌టించే క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ తొలి సారి డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించ‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు పంజా వైష్ణ‌వ్ తేజ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల ఓ చిత్రం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. వై. రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కేవ‌లం 40 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ ప‌క్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్‌కు జోడీగా క్రేజీ భామ ర‌కుల్ ప్రీత్‌సింగ్ న‌టించ‌నుంది. ఇప్ప‌టికే ఆమెని చిత్ర వ‌ర్గాలు క‌న్ఫ‌ర్మ్ చేశాయి. ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి ర‌చించిన `కొండ‌పొలం` న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

- Advertisement -

స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా గ్రామీణ నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ర‌కుల్ ఓ గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన యువ‌తిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో అత్యంత స‌హ‌జంగా క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. ఈ పాత్ర కోసం ర‌కుల్ పూర్తిగా మేక‌ప్ లేకుండా క‌నిపించ‌నుంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ ఫారెస్ట్‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All