Homeటాప్ స్టోరీస్ఆలోచింపచేస్తున్న “మన నుడి – మన నది” సాంగ్

ఆలోచింపచేస్తున్న “మన నుడి – మన నది” సాంగ్

ఆలోచింపచేస్తున్న “మన నుడి – మన నది” సాంగ్
ఆలోచింపచేస్తున్న “మన నుడి – మన నది” సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన నుడి – మన నది” అనే పాటను రిలీజ్ చేసారు. ఇటీవలే, పవన్ కళ్యాణ్ తాజా సినిమా అయిన “వకీల్ సాబ్” సినిమాలో “మగువా.. మగువా” పాట రాసిన రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాటను రాయగా, ఎస్.ఎస్. తమన్ స్వరాలు అందించారు. “నది మన జీవం – నుడి మన జీవనం” అని సాగే ఈ పాట ఒక మనిషికి లేదా ఒక నాగరికతకు సంబంధించి నీరు మరియు స్థానిక భాష ఎంత ముఖ్యమో… తెలియచేస్తున్నాయి.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు రాబోయే భవిష్యత్ ప్రణాళికలో భాగంగా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు తీస్తూ… అది కూడా కేవలం సామాజిక అంశాలు ఉన్న కథలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మొదటి నుండి తన సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ సమాజంలో ఎప్పటి నుండో వేళ్ళూనుకుపోయిన అనేక సమస్యల గురించి ప్రస్తావించడం మరియు వాటిపై తనదైన శైలిలో స్పందించడం చేస్తూ ఉంటారు.

- Advertisement -

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా విడిపోవడానికి కారణమయిన ఎన్నో అంశాలలో నీళ్ళ లెక్కలు, బాష – యాస పై ఉన్న వివక్ష కూడా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు “మన నది – మన నుడి” కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నం పట్ల దేశవ్యాప్తంగా అనేకమంది నుండి ప్రశంశలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటలో “రెండూ రెండు కళ్ళు (నది, నుడి); చరిత్ర పుట్టినిల్లు; పరిరక్షిద్దాం వాటిని ధరిత్రి ఉన్ననాళ్ళూ..” అనే లిరిక్స్ కి అందరూ కనెక్ట్ అవుతున్నారు. కోట్లమందికి రీచ్ అయ్యేలా ఒక మంచి విషయం చెప్పాలంటే… అది పవన్ కళ్యాణ్ లాంటి వారి వల్లే అవుతుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All