Homeటాప్ స్టోరీస్వకీల్ సాబ్ మగువా మగువా సాంగ్ : మహిళలకు సరైన ట్రిబ్యూట్

వకీల్ సాబ్ మగువా మగువా సాంగ్ : మహిళలకు సరైన ట్రిబ్యూట్

vakeel saab first single maguva maguva an instant chart buster
vakeel saab first single maguva maguva an instant chart buster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ కు ముందు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం బజ్ మాములుగా లేదు. ఈ చిత్రం పింక్ రీమేక్ అని తెలియగానే పవన్ ఫ్యాన్స్ లో సగం నీరసం వచ్చేసింది. ఎందుకంటే పింక్ లో అమితాబ్ బచ్చన్ కు ఉండే రోల్ చాలా తక్కువ. అందులోనూ హీరోయిజం ఏం ఉండదు. కొంచెం వయసు పైబడ్డ క్యారెక్టర్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో ఇలాంటి సినిమా అంటే ఫ్యాన్స్ స్టఫ్ తక్కువగా ఉంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడైతే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైందో అప్పటినుండి పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

పవన్ కళ్యాణ్ ఒక స్టైలిష్, రగ్గడ్ లుక్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ కు కావాల్సిన అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని అర్ధమవుతోంది. ఇక మొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొదటి పాటను విడుదల చేసారు. మగువా మగువా అంటూ సాగే ఈ పాట అందరినీ తొలిసారి విన్న దగ్గరనుండి విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో రచయిత రామజోగయ్య శాస్త్రి మహిళల యొక్క గొప్పతనాన్ని, వారు లేకపోతే ప్రపంచం ఎలా ఉండదో చక్కగా వివరించారు. ఇక థమన్ ఎంతటి ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరోసారి థమన్ నుండి ఆకట్టుకునే ట్యూన్ వచ్చింది. దీనికి సెన్సేషనల్ సిద్ శ్రీరామ్ స్వరం కలిసి మగువా మగువా సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

- Advertisement -

ఈ పాట కూడా సూపర్ హిట్ అని తెలియడంతో ఇప్పుడు వకీల్ సాబ్ కు మాములు హైప్ రాలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అంజలి, నివేతా థామస్, అనన్య ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All