
సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. గౌతమ్ కు 15 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా మహేష్ సోషల్ మీడియాలో తన విషెస్ ను తెలియజేసాడు. “హ్యాపీ బర్త్ డే, గౌతమ్, నువ్వు ఎదుగుతుండగా చూడటం నా గొప్ప సంతోషం. ఈరోజు, ఎల్లప్పుడూ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. వెళ్లి ప్రపంచాన్ని జయించు, లవ్ యూ, జిజి” అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
దీంతో పాటు బ్లాక్ అండ్ వైట్ లో మహేష్, గౌతమ్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసాడు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ చేసిన 1 నేనొక్కడినే చిత్రంలో గౌతమ్, మహేష్ చిన్నప్పటి పాత్రను పోషించిన విషయం తెల్సిందే. మహేష్, నమ్రతలకు ఇద్దరు పిల్లలు. గౌతమ్ పెద్దబ్బాయి కాగా సితార కూడా ఉంది.
సితార కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అయితే గౌతమ్ మాత్రం లైమ్ లైట్ కు దూరంగా ఉంటాడు.
Happy 15 my son!! Watching you grow has been my greatest joy. Wishing you the best today and always! Go on and conquer the world ???????????? Love you, GG ♥️♥️♥️ pic.twitter.com/cLbfuCPvRL
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2021