Homeటాప్ స్టోరీస్కీర్తి సురేష్ పుట్టినరోజుకు స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీమ్!

కీర్తి సురేష్ పుట్టినరోజుకు స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీమ్!

కీర్తి సురేష్ పుట్టినరోజుకు స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీమ్!
కీర్తి సురేష్ పుట్టినరోజుకు స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీమ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాటపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్ సరికొత్త లుక్ లో దర్శనమిస్తోన్న ఈ చిత్ర టీజర్ మహేష్ పుట్టినరోజుకు విడుదలై ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. మహేష్ డైలాగ్ డెలివరీ, బీజీఎమ్ కు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. టీజర్ లో కూడా కీర్తి సురేష్ లుక్స్ కు, మహేష్ తో కెమిస్ట్రీకి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట టీమ్ స్పెషల్ ప్రమోషనల్ వీడియో ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 17న కీర్తి సురేష్ తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట టీమ్ నుండి మరో టీజర్ విడుదల కానుంది.

- Advertisement -

ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేశామని మహేష్ తెలిపాడు. పోకిరి వైబ్స్ వస్తున్నాయని తెలపడంతో సర్కారు వారి పాటపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All