Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు పోలీసులను ఎందుకు కాలిశాడో తెలుసా

మహేష్ బాబు పోలీసులను ఎందుకు కాలిశాడో తెలుసా

mahesh babu met telangana academy police officialsమహేష్ బాబు తాజాగా పోలీస్ ఉన్నతాధికారులను కలిసాడు , దాంతో అతడు పోలీసులను ఎందుకు కలిసినట్లు ? సమస్య ఏంటి ? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులని మహేష్ కలవడానికి కారణం షూటింగ్ కోసమే నట ! తాజాగా మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా చేస్తున్నాడు . అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు లతో పాటు పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ని డెహ్రాడూన్ లో జరిపారు , ఇక రెండో షెడ్యూల్ ఇక్కడే .

ఇక పోలీసుల ముందుకు వెళ్ళింది తెలంగాణ పోలీస్ అకాడెమి లో షూటింగ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను కలిసి విన్నవించారట ! మహేష్ అంతటి వాడే వచ్చి అడిగితె కాదంటారా ? వెంటనే ఒప్పేసుకున్నారట అంతేకాదు ఇక్కడ ఏమేమి సన్నివేశాలు తీస్తున్నారో , అకాడెమి లోని ఏ ఏ ప్రాంతాలను వాడుకుంటారో తెలుసుకున్నారట . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు . ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటుగా అల్లరి నరేష్ కూడా పాల్గొననున్నాడట . మహేష్ బాబు కిది 25 వ సినిమా కావడం విశేషం . ఇరవై ఏళ్ల కెరీర్ లో మహేష్ కేవలం 25 సినిమాలు మాత్రమే చేసాడు .

- Advertisement -

English Title: mahesh babu met telangana academy police officials

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All