Homeటాప్ స్టోరీస్దిల్ రాజు ని భయపెడుతున్న విజయ్ దేవరకొండ

దిల్ రాజు ని భయపెడుతున్న విజయ్ దేవరకొండ

hero Vijay Deverakonda scaring Dil Rajuఅగ్ర నిర్మాత దిల్ రాజు ని భయపెడుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ . దిల్ రాజు ని విజయ్ దేవరకొండ భయపెట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత అనూహ్యంగా విజయ్ దేరవకొండ రేంజ్ పెరిగిపోయింది , ముఖ్యం గా యువతలో విపరీతమైన క్రేజ్ విజయ్ సొంతం అయ్యింది . దాంతో ఇటీవలే గీత గోవిందం టీజర్ రిలీజ్ కాగా ఒక్క రోజులోనే 2. 8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది . ఒక్క రోజులోనే షాకింగ్ వ్యూస్ రావడంతో దిల్ రాజు భయపడ్డాడట ! అందుకే కాబోలు ఈనెల 22 న కాకుండా 23న మీ సినిమా టీజర్ ని విడుదల చేసుకోండి అని మెగా కాంపౌండ్ కు ఫోన్ చేసాడు . ఎందుకంటే నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం టీజర్ ని 22 న విడుదల చేసారు దానికి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అవి తక్కువేమి కాదు కానీ విజయ్ దేవరకొండ కు అనూహ్యంగా క్రేజ్ రావడంతో షాక్ అయ్యాడు దిల్ రాజు .

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం చిత్రం ఆగస్టు 15 న విడుదల అవుతుండగా దానికి ఒక వారం రోజుల ముందు అంటే ఆగస్టు 9న నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . నితిన్ సినిమా వచ్చిన వెంటనే విజయ్ దేవరకొండ సినిమా వస్తే కలెక్షన్ల పరంగా కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని భావిస్తున్నాడు దిల్ రాజు . శతమానం భవతి వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న శ్రీనివాస కళ్యాణం చిత్రానికి దర్శకత్వం వహించాడు దాంతో నితిన్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి కానీ విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ దృష్ట్యా భయపడుతున్నాడట ఈ నిర్మాత .

- Advertisement -

English Title: hero vijay deverakonda scaring dil raju

YouTube video

 

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All