Homeటాప్ స్టోరీస్కొత్త రిలీజ్ డేట్ ప్రకటించుకున్న మహా సముద్రం

కొత్త రిలీజ్ డేట్ ప్రకటించుకున్న మహా సముద్రం

కొత్త రిలీజ్ డేట్ ప్రకటించుకున్న మహా సముద్రం
కొత్త రిలీజ్ డేట్ ప్రకటించుకున్న మహా సముద్రం

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న చిత్రం మహా సముద్రం. ఈ చిత్రాన్ని మొదటగా జులైలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ సెకండ్ వేవ్ కారణంగా విడుదలలో జాప్యం వచ్చింది. మొత్తానికి జులైలో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసారు. అలాగే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకోవడంతో ఇప్పుడు రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేసారు. దీంతో పాటు సిద్ధార్థ్, శర్వాలు గన్ పట్టుకుని ఇంటెన్స్ గా ఉన్న ఫోటోను షేర్ చేసారు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఇక అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -

ఆరెక్స్ 100తో గుర్తింపు తెచ్చుకున్న చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక సినిమాలో కేజిఎఫ్ ఫేమ్ గరుడ రామ్, జగపతి బాబు, రావు రమేష్ లు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All