Homeటాప్ స్టోరీస్షూటింగ్ పూర్తి చేసుకున్న మహా సముద్రం

షూటింగ్ పూర్తి చేసుకున్న మహా సముద్రం

షూటింగ్ పూర్తి చేసుకున్న మహా సముద్రం
షూటింగ్ పూర్తి చేసుకున్న మహా సముద్రం

ఆరెక్స్ 100 తో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు అజయ్ భూపతి. కొంత కాలం గ్యాప్ తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం మహా సముద్రం. శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. గత కొంత కాలం నుండి మహా సముద్రం షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నిన్నటితో మహా సముద్రం షూటింగ్ మొత్తం పూర్తయింది.

ఈ సందర్భంగా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. అందులో సిద్ధార్థ్, శర్వానంద్ కలిసి నవ్వుతూ ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అజయ్ భూపతి సస్పెన్స్ మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. టీజర్ వస్తే ఒక ఐడియా వచ్చే అవకాశముంది.

- Advertisement -

శర్వానంద్, సిద్ధార్థ్ ల సరసన హీరోయిన్లుగా అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా మహా సముద్రాన్ని నిర్మిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All