Homeటాప్ స్టోరీస్వీకెండ్ కే మ్యాజికల్ మార్క్ ను టచ్ చేసిన లవ్ స్టోరీ

వీకెండ్ కే మ్యాజికల్ మార్క్ ను టచ్ చేసిన లవ్ స్టోరీ

వీకెండ్ కే మ్యాజికల్ మార్క్ ను టచ్ చేసిన లవ్ స్టోరీ
వీకెండ్ కే మ్యాజికల్ మార్క్ ను టచ్ చేసిన లవ్ స్టోరీ

యూఎస్ తెలుగు బాక్స్ ఆఫీస్ కు కొత్త ఊపిరులూదింది లవ్ స్టోరీ. కరోనా సెకండ్ వేవ్ తర్వాత, ఆ మాటకొస్తే ఈ ఏడాదంతా డల్ గానే ఉన్న యూఎస్ మార్కెట్ టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీ కేవలం ఒక వీకెండ్ లోనే 1 మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకోవడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నిజంగా సెన్సేషనల్ ఫీట్ అనే చెప్పాలి.

ప్రీమియర్స్ తో 250K డాలర్ మార్క్ ను దాటిన లవ్ స్టోరీ ఎక్కడా తగ్గలేదు. కాన్స్టాంట్ గ్రాఫ్ మైంటైన్ చేస్తూ శనివారం కూడా $287K కలెక్షన్స్ ను నమోదు చేసింది. దీంతో శనివారం $900K మార్క్ కు చేరువగా వెళ్లిన లవ్ స్టోరీ ఆదివారంతో 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.

- Advertisement -

నాగ చైతన్య సోలోగా ఈ మార్క్ ను లవ్ స్టోరీతో దాటడం విశేషం. సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. పవన్ సిహెచ్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All