Homeటాప్ స్టోరీస్లవ్ స్టోరీ 2 డేస్ కలెక్షన్స్: సెన్సేషనల్

లవ్ స్టోరీ 2 డేస్ కలెక్షన్స్: సెన్సేషనల్

లవ్ స్టోరీ 2 డేస్ కలెక్షన్స్: సెన్సేషనల్
లవ్ స్టోరీ 2 డేస్ కలెక్షన్స్: సెన్సేషనల్

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తీర్చిదిద్దిన లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు అవుట్ స్టాండింగ్ వసూళ్లను సాధించగా రెండోరోజు కూడా ఫ్లో ను కొనసాగించింది. లవ్ స్టోరీ సెకండ్ డే కలెక్షన్స్ మొదటి రోజుతో పోల్చుకుంటే కొంత తగ్గినప్పటికీ స్టడీగానే ఉన్నాయని చెప్పాలి.

ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్స్ ను చూసుకుంటే 12.05 కోట్ల షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల నుండి వసూలు చేసింది. అటు యూఎస్ లో కూడా లవ్ స్టోరీ దూకుడుగా వ్యవహరిస్తోంది. రెండు రోజులకు కలుపుకుని 700K డాలర్స్ మార్క్ ను దాటిన లవ్ స్టోరీ త్వరలోనే మ్యాజికల్ 1 మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకోనుంది.

- Advertisement -

లవ్ స్టోరీ చిత్రం సేఫ్ అవ్వాలంటే 32 కోట్ల షేర్ ను సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కనుక ఇదే ఫ్లో ను కొనసాగిస్తే దాన్ని అందుకోవడం పెద్ద కష్టమేం కాకపోదు. అయితే వీక్ డేస్ లో లవ్ స్టోరీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుంది అన్నదానిపై చిత్రం ఏ రేంజ్ కు వెళుతుంది అన్నది ఆధారపడి ఉంది.

లవ్ స్టోరీ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:

నైజాం – Rs 5.6 Cr
సీడెడ్ – 1.85 Cr
ఉత్తరాంధ్ర – 1.43 Cr
ఈస్ట్ – 0.76 Cr
గుంటూర్ – 0.82 Cr
కృష్ణ – 0.47 Cr
వెస్ట్ – 0.74 Cr
నెల్లూర్ – 0.38 Cr

ఆంధ్రప్రదేశ్+ తెలంగాణ – Rs. 12.05 Cr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All