Homeటాప్ స్టోరీస్నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!

నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!

నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!
నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!

సెన్సిబుల్ ల‌వ్‌స్టోరీస్‌ని త‌న‌దైన శైలిలో అందించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ని సొంతం చేసుకుంటున్నారు శేఖ‌ర్ క‌మ్ముల. ఆయ‌న నుంచి రానున్న మ‌రో ప్లెజెంట్ ఎమోష‌న‌ల్ ప్రేమ‌క‌థ `ల‌వ్‌స్టోరీ`. నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్నారు. టాలెంటెడ్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్న ఈ మూవీని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్‌పీ, అమిగోస్ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సున్నిత‌మైన భావోద్వేగాల స‌మాహారంగా రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లై  `ఏయ్ పిల్లా.. ` అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేయ‌బోతోంది. ఈ నెల 10న సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ టీజ‌ర్‌ని చిత్ర బృందం విడుద‌ల చేయ‌బోతోంది.

- Advertisement -

`ఫిదా` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత శేఖ‌ర్ క‌మ్ముల‌, సాయి ప‌ల్ల‌విల కాంబినేష‌న్‌లో రానున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై స‌హ‌జంగానే అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ మూవీని శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. కాగా ఈమూవీ టీజ‌ర్‌ని ఈ నెల 10న ఉద‌యం 10:08 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో దేవ‌యాని, రాజీవ్ క‌న‌కాల‌, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All