Homeటాప్ స్టోరీస్నాగ‌చైత‌న్య.. స‌మంత.. ఓ రొమాంటిక్ కిస్‌!

నాగ‌చైత‌న్య.. స‌మంత.. ఓ రొమాంటిక్ కిస్‌!

నాగ‌చైత‌న్య.. స‌మంత.. ఓ రొమాంటిక్ కిస్‌!
నాగ‌చైత‌న్య.. స‌మంత.. ఓ రొమాంటిక్ కిస్‌!

టాలీవుడ్‌లో వున్న అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన స్టార్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌. అత్యంత క్రేజీ జోడీ కూడా వీరిదే. ఈ ఇద్ద‌రిలో సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండేది సమంత‌నే. నిత్యం త‌న‌కు సంబంధించిన పోస్ట్‌ల‌తో పాటు లేటెస్ట్ ఫొటో షూట్‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ని, వీడియోల‌ని షేర్ చేస్తూ అభిమానుల‌తో ట‌చ్‌లో వుంటోంది స‌మంత‌. చై మాత్రం సంద‌ర్భాన్ని బ‌ట్టే సోష‌ల్ మీడ‌యాలో పోస్ట్‌లు పెడుతుంటారు.

కానీ తాజాగా నాగ‌చైత‌న్య పెట్టిన ఓ ఫొటో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం నాగ‌చైత‌న్య‌, స‌మంత త‌మ ఫేవ‌రేట్ హాలీడే స్పాట్ అయిన గోవాకు వెళ్లిపోయారు. అక్క‌డే న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య‌ని స‌మంత రొమాంటిక్‌గా కిస్ చేసింది. సామ్ కిస్ చేస్తుండ‌గా చై ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్న ఫొటో ఇప్పుడు నెట్టింట సంద‌డి చేస్తోంది. ఇదే ఫొటోని స‌మంత కూడా షేర్ చేసింది.

- Advertisement -

`హ్యాపీ 2021 .. మీకు శాంతి, ఆనందం అలాగే మీపై నాకున్న ప్రేమ వెల క‌ట్ట‌లేనిది.. కొల‌వ‌లేనిది` అంటూ స‌మంత ఈ ఫొటోకు ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్‌ని జ‌త‌చేసింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` మూవీతో పాటు విక్ర‌మ్ కె. కుమార్ తెర‌కెక్కిస్తున్న `థ్యాంక్యూ` చిత్రంలో న‌టిస్తున్నారు. స‌మంత న‌టించిన `ఫ్యామిలీ మ్యాన్ 2` స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. తాజాగా గుణ‌శేఖ‌ర్ `శాకుంతలం`కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All