Homeరివ్యూస్లవ్ స్టోరీ : రివ్యూ

లవ్ స్టోరీ : రివ్యూ

Love Story Review Rating

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన సినిమా లవ్ స్టోరీ. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

- Advertisement -

కథ :

ఆర్మూర్ నుండి వచ్చి హైదరాబాద్ లో జుంబ సెంటర్ నడిపిస్తుంటాడు రేవంత్ (నాగ చైతన్య). చిన్నప్పటి నుండి వివక్షతతో విసిగిపోయి ఉన్న రేవంత్ జీవితంలోకి అనుకోకుండా మౌనిక (సాయి పల్లవి) వస్తుంది. బీ.టెక్ పూర్తై జాబ్ చేసేందుకు హైదరాబాద్ వచ్చిన మౌనికకు ఎక్కడ జాబ్ దొరకదు. దానితో రేవంత్ జుంబ సెంటర్ లోనే మౌనిక జాబ్ చేస్తుంది. ఆమె వచ్చాక రేవంత్ జుంబ సెంటర్ బాగా డెవలప్ అవుతుంది. ఇద్దరు కలిసి ఓ పెద్ద ఫిట్ నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో ఇద్ద్దరి కులాలు వేరైనా సరే రేవంత్, మౌనిక ప్రేమించుకుంటారు. అయితే వారి ప్రేమని సాధించుకోవడం కోసం వారు ఏం చేశారు. తన బాబా నరసిం హం (రాజీవ్ కనకాల) అంటే మౌనికకు ఎందుకంత భయం. రేవంత్, మౌనికల ప్రేమ ఫలించిందా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

తెలుగులో చాలా ప్రేమ కథలు వచ్చాయి. జాతి, కుల అంతరంగాలను స్ప్రుషిస్తూ సినిమాలు వచ్చాయి. వాటి తరహాలోనే కుల వివక్షత కలిగిన ఇద్దరి ప్రేమ కథతోనే లవ్ స్టోరీ తీశాడు శేఖర్ కమ్ముల. అయితే లవ్ స్టోరీతో పాటుగా బాలికలపై మన అనుకున్న వారే లైంగిక వేధింపులు జరపడం గురించి కూడా ప్రస్థావించాడు.

ఎప్పుడూ లైటర్ వీన్ కథలతో వచ్చే శేఖర్ కమ్ముల ఈసారి లైంగిక వేధింపుల గురించి చెప్పడం అందరికి షాక్ ఇస్తుంది. ఓ పక్క హీరో, హీరోయిన్ వారి ప్రేమని సఫలం చేసుకోవడమే సినిమా ముగింపు అనుకునేలోగా నరసిం హ పాత్రలో కొత్త మలుపు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తుంది.

శేఖర్ కమ్ముల తను కథ రాసుకున్నంత వరకు బాగానే తెరకెక్కించాడని చెప్పొచ్చు. కుల వివక్ష, పేద, ధనిక అంతరగాలతో ప్రేమ కథలు ఇదివరకు ఎన్నో వచ్చాయి. కాని లవ్ స్టోరీలో మ్యూజిక్, క్యారక్టరైజేషన్ లతో శేఖర్ కమ్ముల తన మార్క్ చూపించాడని చెప్పొచ్చు. యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ అంతా చూసి సమాజంలో జరుగుతున్న విషయాల మీద అవగాహన కలిగించేలా ఉంది ఈ సినిమా.

నటీనటుల ప్రతిభ :

రేవంత్ పాత్రలో నాగ చైతన్య కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మజిలీ నుండి సినిమా సినిమాకు చైతు తన నటనలో ఇంప్రూవ్ మెంట్ చూపిస్తున్నాడు. రేవంత్ పాత్రలో అతని నటన అద్భుతం. ఇక మౌనికగా సాయి పల్లవి మరోసారి తన సత్తా చాటింది. తనకు ఇచ్చిన పాత్రకి నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, దేవయాని పాత్రలు మెప్పించాయి. ఉత్తేజ్ కూడా పోలీస్ పాత్రలో ఇంప్రెస్ చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాకు పవన్ సి.హెచ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పొచ్చు. మొదటి సినిమానే అయినా పవన్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. నీ చిత్రం చూసి, సారంగ దరియ సాంగ్స్ సూపర్ అనిపించాయి. ఇక సినిమాటోగ్రఫీ విజయ్ సి కుమార్ తన పనితనం చూపించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. శేఖర్ కమ్ముల ఎంచుకున్న కథకు పూర్తి న్యాయం చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

నాగ చైతన్య

సాయి పల్లవి

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

అక్కడక్క స్లో అవడం

బాటం లైన్ :

లవ్ స్టోరీ.. ఒక్కసారి చూసే సినిమా..!

రేటింగ్ : 3/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All