Homeటాప్ స్టోరీస్లవ్ స్టోరీ డే 1: బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిందిగా!!

లవ్ స్టోరీ డే 1: బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిందిగా!!

లవ్ స్టోరీ డే 1: బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిందిగా!!
లవ్ స్టోరీ డే 1: బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిందిగా!!

కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కుంటుపడింది. గత రెండు నెలల నుండి సినిమాలు విడుదలవుతున్నా, ఓ మాదిరి ఫలితాలు అందుకుంటున్నా, బాక్స్ ఆఫీస్ ను ప్రభావితం చేయగల సినిమా మాత్రం రాలేదు. అయితే ఆ లోటుని లవ్ స్టోరీ తీర్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ ను సృష్టించింది.

ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 కోట్ల షేర్ ను సాధించిందని సమాచారం. అందులో ఆంధ్ర ప్రాంతం నుండి 5 కోట్ల షేర్ రాగా నైజాం ఏరియా నుండి 3 కోట్ల షేర్ ను సాధించింది. ఇక యూఎస్ లో లవ్ స్టోరీ ప్రభంజనం మాములుగా లేదు.

- Advertisement -

డే 1 నెంబర్స్ కలుపుకుంటే ప్రీమియర్స్ తో పాటు హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. మొత్తంగా లవ్ స్టోరీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన ఊపుని తీసుకొచ్చింది. ఈ చిత్ర కలెక్షన్స్ అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు కావాల్సిన భరోసాను కల్పిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All