Homeటాప్ స్టోరీస్అడ్వాన్స్ బుకింగ్స్ తో హంగామా మొదలుపెట్టిన లవ్ స్టోరీ

అడ్వాన్స్ బుకింగ్స్ తో హంగామా మొదలుపెట్టిన లవ్ స్టోరీ

అడ్వాన్స్ బుకింగ్స్ తో హంగామా మొదలుపెట్టిన లవ్ స్టోరీ
అడ్వాన్స్ బుకింగ్స్ తో హంగామా మొదలుపెట్టిన లవ్ స్టోరీ

కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో సందడి తక్కువైంది. ఈ మధ్య కొన్ని చిత్రాలు విడుదలైనా కూడా ఇండస్ట్రీకి బూస్టప్, కిక్ ఇచ్చే ఓపెనింగ్స్ వచ్చిన చిత్రం లేదు. వచ్చినా అది ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేదు. అయితే లవ్ స్టోరీ చిత్రంతో సీన్ మారేలా కనిపిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది. అయితే వారం ముందే ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ ను మొదలుపెట్టారు.

నిన్నటి నుండి లవ్ స్టోరీ అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి రాగా అప్పుడే ఓపెనింగ్ డేకు హైదరాబాద్ లో 35 శాతం టికెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఒక్క ఏఎంబి సినిమాస్ 6,000 టికెట్లను ఇప్పటివరకూ అమ్మింది. లవ్ స్టోరీ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

శేఖర్ కమ్ముల బ్రాండ్ ఈ చిత్రంపై పనిచేస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించింది. పవన్ సిహెచ్ అందించిన సంగీతం సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All