Homeటాప్ స్టోరీస్మొత్తానికి లవ్ స్టోరీను పూర్తి చేసిన శేఖర్ కమ్ముల

మొత్తానికి లవ్ స్టోరీను పూర్తి చేసిన శేఖర్ కమ్ముల

మొత్తానికి లవ్ స్టోరీను పూర్తి చేసిన శేఖర్ కమ్ముల
మొత్తానికి లవ్ స్టోరీను పూర్తి చేసిన శేఖర్ కమ్ముల

లవ్ స్టోరీ చిత్రం గత రెండేళ్లుగా షూటింగ్ ను కొనసాగిస్తూ వచ్చింది. గతేడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమా ఇప్పటికీ కూడా ఇంకా విడుదల కాలేదు. కరోనా కారణంగా ఎఫెక్ట్ అయిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. సెప్టెంబర్ 10కి లవ్ స్టోరీ విడుదల తేదీ ఇచ్చేసినా కానీ ఇంకా షూటింగ్ చేసుకుంటూ వచ్చాడు శేఖర్ కమ్ముల.

రీషూట్ కు వెళ్లిన లవ్ స్టోరీ రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరిలో షూటింగ్ ను చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి ఈ షెడ్యూల్ లో పాల్గొనగా మొత్తానికి షూటింగ్ పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఓ కొలిక్కి వచ్చేసాయి. అయితే సినిమా మాత్రం ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్లకు సంబంధించి కొత్త జీఓ వచ్చాకే విడుదలయ్యే అవకాశముంది.

- Advertisement -

లవ్ స్టోరీ చిత్రానికి మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పవన్ సిహెచ్ సంగీతం అందించగా ఏషియన్ సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All