Homeటాప్ స్టోరీస్ఇంకా సీరియస్ కండిషన్ లోనే కైకాల ఆరోగ్యం

ఇంకా సీరియస్ కండిషన్ లోనే కైకాల ఆరోగ్యం

ఇంకా సీరియస్ కండిషన్ లోనే కైకాల ఆరోగ్యం
ఇంకా సీరియస్ కండిషన్ లోనే కైకాల ఆరోగ్యం

వెటరన్ నటులు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించిన విషయం తెల్సిందే. నెల రోజుల క్రితం తన ఇంట్లో కిందపడడంతో పాటు కోవిడ్ కూడా సోకింది. అప్పుడు సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయగా కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే మళ్ళీ రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర జ్వరం, తల తిరగడం వంటి లక్షణాలతో జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో కైకాల సత్యనారాయణను అడ్మిట్ చేసారు.

హాస్పిటల్ వర్గాలు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ వస్తోంది. కైకాల ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. మెడికల్ టీమ్ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. తాజాగా అపోలో హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కైకాల సత్యనారాయణకు స్పృహ వచ్చింది. అయితే ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ఆయన వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్నట్లు కూడా స్పష్టం చేసారు.

- Advertisement -

ఆయన సుదీర్ఘమైన కెరీర్ లో 750కు పైగా చిత్రాల్లో నటించారు కైకాల. గత కొన్నేళ్లుగా వయసు రీత్యా నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ

నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇంటర్వ్యూ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All