Homeటాప్ స్టోరీస్సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం

సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం

సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం
సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం

సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. కైకాల ఫ్యామిలీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం ప్రకారం నిన్న రాత్రి నుండి కైకాల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దీంతో ఈరోజు తెల్లవారుజామున కైకాలను జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అదనపు సమాచారం రావాల్సి ఉంది.

అక్టోబర్ 31న కైకాల సత్యనారాయణను సికింద్రాబాద్ లోని ఒక ఆసుపత్రిలో జాయిన్ చేసిన విషయం తెల్సిందే. ఆయనకు అప్పుడు కరోనా వైరస్ సోకింది. దానికి తోడు ఇంట్లో జారిపడడంతో, నొప్పి కొన్ని రోజులైనా తగ్గకపోవడంతో సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

కైకాల ఒక లెజండరీ నటులు. దాదాపు 750కు పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఆయన పోషించని పాత్ర అంటూ ఏదీ లేదు. వయసు రీత్యా ఆయన గత కోనేళ్ళుగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కైకాల సత్యనారాయణను రీసెంట్ గా టీమ్ నఘం మూవీ పోస్టర్ లాంచ్ కోసం ఆయన ఇంటికి వెళ్లి కలిశారు.

ఇవి కూడా చదవండి:

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ

యన్.టి.ఆర్ లో హెచ్.ఎం.రెడ్డిగా నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ !!

విశ్వ విఖ్యాత నట సామ్రాట్‌.. కైకాల సత్యనారాయణ – టి.సుబ్బరామిరెడ్డి MP

దీపావళి సందర్భంగా నఘం ఫస్ట్ లుక్!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All