HomePolitical Newsఎన్టీఆర్ కోరిక నెరవేర్చిన సీఎం జగన్

ఎన్టీఆర్ కోరిక నెరవేర్చిన సీఎం జగన్

ఎన్టీఆర్ కోరిక నెరవేర్చిన సీఎం జగన్
ఎన్టీఆర్ కోరిక నెరవేర్చిన సీఎం జగన్

దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తన భార్య అయిన లక్ష్మీ పార్వతి కి తన క్యాబినెట్ లో ఒక సముచిత స్థానం ఉండాలని ఆశించే వారు. ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీ గా కాకపోయినా, వృత్తి రీత్యా ఆమె భాషాపండితురాలు కాబట్టి, అందుకు తగ్గ స్థానంలో ఆమెను నియమించాలని అనుకున్నారు. కానీ రెండో సారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పదవీచ్యుతుడు కావడం, ఆయన స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లడం జరిగింది. అప్పటి నుండి లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు కి బద్ద శత్రువు గా వ్యవహరిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు పై ప్రభుత్వ విధానాలు మరియు వ్యక్తిగత ఎదురుదాడి విషయంలో పలు న్యూస్ ఛానల్ డిబేట్ లలో ఆమె పాల్గొంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు పై విమర్శల విషయంలో ఎప్పుడూ లక్ష్మీ పార్వతి జగన్ కు అండగా ఉంటూ వచ్చారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత ఆమె పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపుకు వెళ్లారు. పార్టీ తరఫున ఎటువంటి పదవి ఆమె ఆశించలేదు. కానీ ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఆమెకు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. భవిష్యత్తులో ఆమెకు కేబినెట్ ర్యాంకు తో సమానంగా ప్రభుత్వ సౌకర్యాలు కల్పించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చూస్తే, ఆవిడ అనుభవానికి అర్హతకు ఇది అన్ని రకాలుగా తగిన పదవి. మరియు రాజకీయ కోణంలో ఎన్టీఆర్ కుటుంబానికి సముచిత స్థానం జగన్ కల్పించాలన్న మైలేజ్ కూడా వస్తుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ అభిమానులు సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All