Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ ది సహజ మరణం కాదంటున్న డాక్టర్

ఎన్టీఆర్ ది సహజ మరణం కాదంటున్న డాక్టర్

సినీ , రాజకీయ రంగాలను శాసించిన డాక్టర్ నందమూరి తారకరామారావు ది సహజ మరణం కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది డాక్టర్ కుసుమారావు . ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్నేహితురాలైన డాక్టర్ కుసుమారావు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించింది . లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించినంత మంచి వ్యక్తి లక్ష్మీపార్వతి కాదని , ఎన్టీఆర్ కు మగతనాన్ని పెంచే స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం వల్లే ఎన్టీఆర్ చనిపోయాడని అంతేకాని అందరూ అనుకున్నట్లుగా సహజ మరణం కాదని వ్యాఖ్యానించింది డాక్టర్ కుసుమారావు .

- Advertisement -

ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత నేను చాలా దగ్గరగా చూశానని , దాన్ని బట్టి ఆయనది సహజ మరణం కాదని ఈ విషయం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కానీ ఎందుకు ఆ విషయాలను దాచి పెట్టారో అర్ధం కావడం లేదని , అలాగే ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని అనడం కూడా సరికాదని ఎందుకంటే జీవిత కథ రాస్తానని వచ్చిన లక్ష్మీపార్వతి క్రమేణా కిచెన్ కేబినెట్ ని నడిపించిందని అందుకే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం అలా చేయాల్సి వచ్చిందని అంటోంది . ఇటీవలే రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు ని వెన్నుపోటు దారుడిగా చూపించిన విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All