Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: మూడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ అవుట్!!

బిగ్ బాస్ 5: మూడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ అవుట్!!

బిగ్ బాస్ 5: మూడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ అవుట్!!
బిగ్ బాస్ 5: మూడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ అవుట్!!

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి నుండే ఆసక్తికరంగా సాగుతోంది. అప్పుడే బిగ్ బాస్ 5 మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇంట్లోకి 19 మంది కంటెస్టెంట్స్ వెళ్లగా అందులో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మూడో కంటెస్టెంట్ నిన్న ఎలిమినేట్ అయ్యారు. ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా మహిళలే కావడం విశేషం. 19 మందిలో 10 మంది లేడీ కంటెస్టెంట్స్, 9 మంది జెంట్స్ హౌజ్ లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడిక ఏడుగురు మాత్రమే లేడీ కంటెస్టెంట్స్ మిగిలారు.

మొదటి వారం సరయు ఎలిమినేట్ అవ్వగా, రెండో వారం ఉమా దేవి ఎలిమినేట్ అయింది. ఇక ఈరోజు జరగబోయే ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడో వారం మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. మానస్, శ్రీరామ్ చంద్ర, ప్రియా, ప్రియాంక, లహరిలు నామినేషన్స్ లో నిలిచారు. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున శ్రీరామ్ చంద్ర, ప్రియాంకలను సేవ్ చేసాడు.

- Advertisement -

ఇక ఈరోజు మానస్, ప్రియా, లహరిలలో లహరి ఎలిమినేట్ కాబోతోంది. అయితే ఎలిమినేట్ అయిన ముగ్గురూ కూడా కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడి, హౌజ్ మేట్స్ పై నోరు పారేసుకున్నవారే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All