Homeటాప్ స్టోరీస్బంగార్రాజు షూటింగ్ ను మొదలుపెట్టిన నాగార్జున

బంగార్రాజు షూటింగ్ ను మొదలుపెట్టిన నాగార్జున

 

nagarjuna commences bangarraju shooting
nagarjuna commences bangarraju shooting

అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిజీగా మారాడు. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తోన్న నాగార్జున త్వరలో బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటాడు. అయితే ఈలోగానే నాగార్జున మరో సినిమాను మొదలుపెట్టాడు. సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు చిత్ర షూటింగ్ ను ఈరోజు నుండి మొదలుపెట్టారు. ఈ నెల 20న చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేసారు.

- Advertisement -

ఈ ప్రాజెక్ట్ గత రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నాగార్జున పలు మార్లు స్క్రిప్ట్ కు సంబంధించి మార్పులను సూచించడంతో ఈ డిలే అయింది. ఈరోజు నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో చిత్రీకరణ చేస్తారు. స్వర్గం, నరకం, ఒక ఇల్లు సెట్స్ ను ఒకే ఫ్లోర్ లో నిర్మించారు.

బంగార్రాజు షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే జరుగుతుంది. ఈ చిత్రంలో ఇంకా రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All