
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం మరాఠీ చిత్రం ఆధారంగా `రంగ మార్తాండ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుంతం చిత్రీకరణ చివరి దశలో వుంది. ఇదిలా వుంటే క్రియేటీవ్ జీనియస్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ మహా శివరాత్రి శుభ సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘అన్నం’ అని పేరు పెట్టారు.
మహా శివరాత్రి శుభాకాంక్షలు. మై నెక్స్ట్ ఎన్ ఎక్స్‌ప్లోజివ్.. ఓం నమఃశివాయ` అని ట్వీట్ చేసిన కృష్ణవంశీ తన కొత్త చిత్రం టైటిల్ పోస్టర్ ని షేర్ చేశారు. టైటిల్ పోస్టర్ చాలా శక్తివంతంగా వుంది. పరబ్రహ్మ స్వరూపం’ అని టైటిల్‌కు ట్యాగ్‌లైన్ ని ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టైటిల్ పోస్టర్‌లో అరటి ఆకుపై రక్తపు మరకలు కనిపిస్తుండగా బియ్యంతో తెలుగు అక్షరాలతో టైటిల్ వ్రాశారు.
టైటిల్ పోస్టర్‌లో రక్తం ఓడుతున్న అరటాకు.. ఒక కొడవలి మంగళసూత్రం కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్, ఉచిత పథకాలు, ఆత్మహత్య, ల్యాండ్ మాఫియా, కాల్ మనీ వంటి ఆంగ్ల పదాలు కనిపిస్తున్నాయి. అంటే కృష్ణవంశీ నవర్‌ఫుల్ కథాంశాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. రైతు సమస్యలే ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం కృష్ణ వంశీ నందమూరి బాలకృష్ణతో `రైతు’ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఈ మూవీ కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని కృష్ణవంశీ ప్లాన్ చేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.