Homeటాప్ స్టోరీస్అన్న‌య్య ఫిక్స‌యిన‌ డేట్‌కు త‌మ్ముడి సినిమా?

అన్న‌య్య ఫిక్స‌యిన‌ డేట్‌కు త‌మ్ముడి సినిమా?

అన్న‌య్య ఫిక్స‌యిన‌ డేట్‌కు త‌మ్ముడి సినిమా?
అన్న‌య్య ఫిక్స‌యిన‌ డేట్‌కు త‌మ్ముడి సినిమా?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచానికి ఓ ఉప‌ద్ర‌వంగా మారింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్ డౌన్‌ని పాటిస్తున్నాయి. మ‌న దేశంలోనూ క‌రోనా విక‌టాట్ట‌హాసం చేస్తుండ‌టంతో ఇక్క‌డ కూడా 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని విధించారు. దీని ప్ర‌భావం సామాన్య జ‌నాల‌పై ప‌డింది. ముఖ్యంగా సినిమా షూటింగ్‌ల‌పై ప‌డింది. భారీ చిత్రాల నుంచి చిన్న చిత్నాల వ‌ర‌కు అన్నీ ఆగిపోయాయి.

ఇదే లైన్‌లో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాలు కూడా ఆగిపోయాయి. ప‌వ‌న్ బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌` మెరుపు వేగంతో పూర్త చేయాల‌ని ప్లాన్ చేశారు. కొంత వ‌ర‌కు పూర్తి చేశారు కూడా. అయితే మేజ‌ర్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్‌గానే వుంద‌ట‌. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ముందు అనుకున్న ప్ర‌కారం జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ చేయాల‌నుకున్నారు.

- Advertisement -

తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టాలి… ఆ త‌రువాత కూడా కొంత స‌మ‌యం తీసుకోవాలి. అప్పుడే మ‌ళ్లీ షూటింగ్‌లు చేసే అవ‌కాశం వుంటుంది. అంటే దాదాపు నెలకు మించే స‌మ‌యం ప‌ట్టేలావుంది. దీంతో ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 14న రిలీజ్ చేస్తే ఎలా వుంటుంద‌ని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నాడ‌ట. ఆ డేట్ మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌` కోసం అనుకున్నారు. ఆ డేట్‌లో త‌మ్ముడు ప‌వ‌న్ చిత్రాన్ని రిలీజ్ చేస్తే అన్న‌య్య సినిమా మ‌రో డేట్ చూసుకోవాల్సిందే అని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All