
ప్రముఖ నటుడు కృష్ణంరాజు, స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వని దత్ తమ భూములకు పరిహారం చెల్లించాలంటూ ఏపీ ప్రభుత్వంపై పిటీషన్లు దాఖలు చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణరాజు, స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లా్యంగ్ పూలింగ్‌లో భాగంగా అశ్వనీదత్ 39 ఎకరాల భూమిని, కృష్ణంరాజు 31 ఎకరాల భూమిని గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు అప్పగించారు.
అయితే ఏపీలో టీడీపీ ప్రభుత్వం మారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మూడు రాజధానులంటూ ప్రకటన చేయడం తెలిసిందే. దీంతో తాము అప్పటి ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన భూమికి నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ కృష్ణరాజు, స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తాజాగా హైకోర్టుని ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ల్యాండ్ పూలింగ్ చట్టం 2013 ప్రకారం విమానాశ్రయం అథారిటీ తన 39 ఎకరాల భూమికి 210 కోట్ల రూపాయలు చెల్లించిన తరువాత మాత్రమే నిర్మాణాలను ప్రారంభించవచ్చని అశ్వనీదత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
సీఆర్‌డీఏ ఒప్పందాల ప్రకారం రాష్ట్ర రాజధానిలో సమాన విలువైన భూములను ఆఫర్ చేసిన తరువాతే తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించామని కృష్ణరాజు, స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తమ పిటీషన్‌లో పేర్కన్నారట. దీంతో తాజా వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.