
సినిమా మేకింగ్ లో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా కీలకం. దర్శకుడి ఊహను తన కెమెరా కంటితో బంధించాల్సి ఉంటుంది. అదే సినిమాటోగ్రాఫర్ దర్శకుడు అయితే? అది కచ్చితంగా చిత్రాలకు పనికొస్తుంది. గతంలో సినెమాటోగ్రఫర్స్ గొప్ప గొప్ప చిత్రాలను డైరెక్ట్ చేసారు. ఇప్పుడు అదే కోవలో చేరుతున్నాడు ‘గరుడవేగ‘ అంజి.
ది అంగ్రేజ్, సీతా రాముడు చిత్రాలతో సినిమాటోగ్రాఫర్ గా ఎదిగిన అంజి ఇప్పుడు తన ఛాయాగ్రాహకుడిగా 50వ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలకు కూడా పనిచేసిన అంజి ఇప్పుడు యూత్ ను ప్రధానంగా టార్గెట్ గా పెట్టుకుని 10th క్లాస్ డైరీస్ చిత్రాన్ని రూపొందించాడు.
శ్రీరామ్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన 10th క్లాస్ డైరీస్ ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేసాడు. ఈ ఫస్ట్ లుక్ లో హీరో, హీరోయిన్స్ తో పాటు ప్రముఖ పాత్రలు పోషించిన వారు కూడా ఉండటం విశేషం. శ్రీనివాస రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. అన్విత అవని క్రియేషన్స్ పతాకంపై అచ్యుత రామారావు, పి రవితేజ మన్యం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రవికుమార్ కొల్లిపార కోప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. త్వరలోనే టీజర్, డిసెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Unveiling the First-look of movie #10thClassDiaries ?
All the best to ‘Garuda Vega’ Anji @director_anji n the team @Act_srikanth @avika_n_joy @vennelaramarao @PrawinPudi @sureshbobilli @Dopanji @SRMovieMakers1 @Actorysr @PulagamOfficial #Nazar #Himaja #archana #sivabalaji pic.twitter.com/Kclm2JQLF1
— Krish Jagarlamudi (@DirKrish) October 20, 2021