
సినిమాటోగ్రాఫర్ అంజి, గరుడవేగ చిత్రానికి పనిచేయడం ద్వారా దాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. గరుడవేగ చిత్రానికి అందించిన సినిమాటోగ్రఫీ స్పెషల్ హైలైట్ గా నిలిచింది. నిజానికి ది అంగ్రేజ్, సీతారాముడు వంటి చిత్రాలతో ఇండస్ట్రీకి పరిచయమైన అంజి తొలి చిత్రాలతోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గరుడవేగ తనకు స్పెషల్ గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పటికే 49 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన అంజి, తన 50వ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండడం విశేషం.
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో అచ్యుత రామారావు, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన సినిమా టెన్త్ క్లాస్ డైరీస్. ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. దసరా సందర్భంగా ఈరోజు చిత్ర టైటిల్, ఇతర వివరాలను ప్రకటించారు. తన తొలి డెబ్యూ సినిమా మీద అంజి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. “సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ తమ టెన్త్ క్లాస్ రోజులను గుర్తుచేసుకుంటారు. మా నిర్మాతలు నాకు పూర్తిగా సహకరించారు. నేను ఏది అడిగినా కాదనలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. టెక్నికల్ టీమ్ వర్క్ అయితే అవుట్ స్టాండింగ్” అని వ్యాఖ్యానించాడు.
ఇక టైటిల్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావడం పట్ల నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలను తెలియజేస్తామని అన్నారు.
Unveiling a classy Title & Motion poster of #10thClassDairys ❤
▶️ https://t.co/pEb8vWeVL3#HappyDussehra everyone ?@Act_Srikanth @Avika_n_Joy @Actorysr @Pravinpudi @Sureshbobbili @director_anji @Vennela_ramarao @SRMoviemakers1 @PulagamOfficial pic.twitter.com/nuqTW7tDrF
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 15, 2021