Homeటాప్ స్టోరీస్కేటీఆర్ కు సవాల్ విసిరిన కొండా మురళి

కేటీఆర్ కు సవాల్ విసిరిన కొండా మురళి

Konda murali fires on ktrతెలంగాణ యువ నాయకుడు కల్వకుంట్ల తారకరామారావు ని ఛాలెంజ్ చేస్తున్నాడు కొండా మురళి. కేటీఆర్ నీకు దమ్ముంటే వరంగల్ జిల్లా బాధ్యతలు తీసుకొని నాతో పోటీపడి నీ దమ్ము చూపించు అంటూ సవాల్ విసిరాడు కొండా మురళి. వరంగల్ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలుచు కోదని , గెలవనిచ్చే ప్రసక్తే లేదని శపథం చేస్తున్నాడు కొండా మురళి. వరంగల్ ఈస్ట్ స్థానం నుండి టీఆర్ఎస్ తరుపున గత ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించింది కొండా సురేఖ . అయితే ఈసారి మాత్రం కొండా సురేఖ కు టికెట్ కేటాయించకపోవడంతో కేసీఆర్ , కేటీఆర్ లపై నిప్పులు చేరుగుతూ టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరారు కొండా దంపతులు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు మంచి పలుకుబడి ఉంది దాంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా రానీయకుండా ప్రచారం చేస్తామని సవాల్ విసురుతున్నాడు కొండా మురళి. నిజంగా కేటీఆర్ కు దమ్ముంటే నాతో పోటీ పడాలని , వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి గా ప్రచార బాధ్యతలు చేపట్టాలని అప్పుడు నీ సత్తా ఏంటో తెలుస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు కొండా మురళి. వరంగల్ జిల్లాలో కనీసం అయిదు నియోజకవర్గాల్లో కొండా దంపతులు ప్రభావం చూపించే అవకాశం ఉంది దాంతో టీఆర్ఎస్ కు వరంగల్ జిల్లాలో ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

- Advertisement -

English Title: Konda murali fires on ktr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All