Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ టీఆర్ఎస్ తరుపున ప్రచారం చేయనున్నాడా ?

విజయ్ దేవరకొండ టీఆర్ఎస్ తరుపున ప్రచారం చేయనున్నాడా ?

vijay devarakonda will campaign on trsపెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో యువతలో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ తెలంగాణ లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరపున వచ్చే శాసనసభ ఎన్నికలలో ప్రచారం చేయనున్నాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ చతురతతో ప్రతిపక్షాలు లేకుండా చేసాడు అయినప్పటికీ అక్కడక్కడా ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. దానికి తోడు ఎన్నికల సమయానికి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం లు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలియడంతో తెలంగాణలో స్టార్ క్యాంపెయిన్ కంపల్సరీ అని భావిస్తున్నారట ! ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ స్టార్స్ ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు . కాగా ఇటీవలే స్టార్ లీగ్ లో చేరిన క్రేజీ స్టార్ , టాలీవుడ్ నయా సూపర్ స్టార్
విజయ్ దేవరకొండ ని టీఆర్ఎస్ తరుపున తురుపుముక్క గా ప్రచారబరిలో దించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే యంగ్ లీడర్ కల్వకుంట్ల తారకరామారావు కు మంచి స్నేహితుడు విజయ్ దేవరకొండ. కేటీఆర్ ని అన్నా ! అని ఆప్యాయంగా పిలుస్తాడు ఈ హీరో . పెళ్లి చూపులు ఘనవిజయం నేపథ్యంలో జరిగిన ఇద్దరి మద్య పరిచయం అన్నాదమ్ముల అనుబంధం గా మారింది అర్జున్ రెడ్డి సినిమాతో. పైగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడంతో త్వరగా కేటీఆర్ కు అభిమాన పాత్రుడయ్యాడు విజయ్ దేవరకొండ. దాంతో ఈ డిసెంబర్ లో కానీ లేదంటే ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున విజయ్ చేత ప్రచారం చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మిగతా పార్టీ లకు అంతగా బలం లేనప్పటికీ , ఛాన్స్ ఇవ్వకూడదని ఇలా ఆలోచన చేస్తున్నారట . వంద సీట్ల ని గెల్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి , అక్కడక్కడా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రచారం మరింతగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. ఇక తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఈమద్యే తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు ని వేలం వేసి మరీ 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి కి విరాళం అందించిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ ల ప్రచారానికి విజయ్ దేవరకొండ కూడా తోడైతే దుమ్ము దుమారమే తెలంగాణ ఎన్నికల్లో.

- Advertisement -

English Title: vijay devarakonda will campaign on trs

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All