Homeటాప్ స్టోరీస్కేటీఆర్ 2002 లుక్ వైరల్

కేటీఆర్ 2002 లుక్ వైరల్

ktr young look goes viralతెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 2002 లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . పదహారేళ్ళ క్రితం మరింత యంగ్ కా కనిపిస్తున్న కేటీఆర్ ఫోటో పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు , నెటిజన్లు . 2002 లో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో తీసిన ఫోటో అది కాగా అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది ,పైగా ఆ ఉద్యమాన్ని ప్రారంభించింది కేసీఆర్ కావడంతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు తిరిగి వచ్చి రాజకీయాల్లోకి ప్రవేశించి 2009 లో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తో గెలుపొందాడు .

కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్దించాక మళ్ళీ అక్కడి నుండే పోటీచేసి గెలుపొంది ఐటీ శాఖా మంత్రి గా , మున్సిపల్ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు . యువనేత గా తెలంగాణ రాష్ట్రంలో చెరగని ముద్ర వేసిన కేటిఆర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ పలు సమస్యలను పరిష్కరిస్తూ యువత గుండెల్లో గూడు కట్టుకున్నాడు . ఇక 2002 నాటి ఫోటో ని షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు కేటిఆర్ అభిమానులు . నాయకుల కొడుకులు ఆ స్థాయి పరిణతి సాధించలేరు కానీ కేటిఆర్ మాత్రం అత్యంత ప్రతిభాశాలి గా మన్ననలు అందుకుంటున్నాడు .

- Advertisement -

English Title: ktr young look goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All