Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి ఇంటికెళ్లిన కేటీఆర్

అర్జున్ రెడ్డి ఇంటికెళ్లిన కేటీఆర్

telangana minister KTR went to vijay devarakonda house for lunchఅర్జున్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి  కల్వకుంట్ల తారకరామారావు . తనకు ఇష్టమైన నాయకుడు ఇంటికి రావడంతో విజయ్ దేవరకొండ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది . నిన్న లంచ్ కి విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళాడు కేటీఆర్ , దాంతో తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నాయకుడికి సాదర స్వాగతం పలికి ఆతిధ్యం ఇచ్చారు . అంతేకాదు మంత్రి కేటీఆర్ తో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మొత్తం ఫోటోలు దిగారు , ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసాడు విజయ్ దేవరకొండ .

ఇటీవల అర్జున్ రెడ్డి చిత్రంలోని నటనకు గాను విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు లభించిన విషయం తెలిసిందే . దాంతో ఆ అవార్డు ని వేలం వేసి ముఖ్యమంత్రి సహాయ నిధి కి ఇవ్వనున్నట్లు ప్రకటించగానే మంచి నిర్ణయం తీసుకున్నావ్ విజయ్ అంటూ కేటీఆర్ అతడ్ని మెచ్చుకున్నాడు . ఇక పెళ్లి చూపులు చిత్రం నుండి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది అర్జున్ రెడ్డి చిత్రంతో మరింత పెరిగింది పైగా ఇద్దరిదీ ఒకటే కులం కావడం కూడా బాగా కలిసొచ్చింది .

- Advertisement -

English Title: telangana minister KTR went to vijay devarakonda house for lunch

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All