HomeVideos`ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ‌మండ‌పం` టీజ‌ర్ రిలీజ్‌!

`ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ‌మండ‌పం` టీజ‌ర్ రిలీజ్‌!

`ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ‌మండ‌పం` టీజ‌ర్ రిలీజ్‌!
`ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ‌మండ‌పం` టీజ‌ర్ రిలీజ్‌!

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న చిత్రం `ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ‌మండ‌పం`. శ్రీ‌ధ‌ర్ గాదె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `ట్యాక్సీవాలా` ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రాజు, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్ర టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాట్లాడుతూ `తొలి ప్ర‌య‌త్నంగా చేసిన `రాజా వారు రాణీ గారు` చిత్రాన్నిస‌క్సెస్ చేశారు. మా రెండ‌వ సినిమా `ఎస్‌. ఆర్‌. క‌ల్యాణ్ మండ‌పం`. టీజ‌ర్ బాగుంద‌ని అంతా అంటున్నారు. చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో సాయికుమార్ గారి పాత్ర చాలా ప్ర‌త్యేకంగా వుంటుంది. అన్ని విభాగాలు బాగా స‌పోర్ట్ చేశాయి. షార్ట్ ఫిలింస్ చేసిన నేను ఈ స్థాయికి వ‌చ్చాను. వీలైనంత మంచి చిత్రాలు చేయ‌డానికే ప్ర‌య‌త్నిస్తాను. ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. మీ అంద‌రిని ల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాను` అన్నారు.

- Advertisement -

త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ `కిర‌ణ్ అబ్బ‌వ‌రం క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చాడు. త‌న ప్ర‌య‌త్నాన్ని మ‌నం అంతా స‌పోర్ట్ చేయాలి. ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో చూస్తే మ‌రింత మంది ఇలాంటి టాలెంటెడ్ న‌టులు వ‌స్తారు. ఒక మంచి క‌థ‌తో `ఎస్‌. ఆర్‌. క‌ల్యాణ్ మండ‌పం` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది` అన్నారు.  `సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎన‌ర్జీతో పూర్తి చేశార‌ని, కిర‌ణ్ అబ్బ‌వ‌రం చాలా మందికి స్ఫూర్తి అని కొత్తగా వ‌చ్చే న‌టులు అంతా మిమ్మ‌ల్ని ఆద‌ర్శంగా తీసుకోవాలి` అని సింహా కోడూరి తెలిపారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All