Homeన్యూస్‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అంటున్న కిరణ్ అబ్బవరం

‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అంటున్న కిరణ్ అబ్బవరం

‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అంటున్న కిరణ్ అబ్బవరం
‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అంటున్న కిరణ్ అబ్బవరం

‘రాజావారు రాణిగారు’ .. ‘ఎస్.ఆర్. కల్యాణ మంటపం’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకొని, యూత్ ను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా ‘సెబాస్టియన్ PC 524‘ మూవీ తో మర్చి 04 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజు – ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం సరసన నాయికలుగా నువేక్ష .. కోమలి ప్రసాద్ కనువిందు చేయనున్నారు.

ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే మరో సినిమాకు శ్రీకారం చుట్టారు.  ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే వినూతన టైటిల్ తో సినిమాను పూర్తీ చేసాడు. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ కుమార్తె దివ్యదీప్తి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు.

- Advertisement -

కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ అనే నూతన సంస్థపై ప్రొడక్షన్ నెం. 1గా సినిమాను నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు (బుధవారం) ఉదయం లాంఛ్ చేశారు మేకర్స్. మాస్ గెటప్ లో స్టైలిష్ గా రివీలైన కిరణ్ అబ్బవరం లుక్ ఆకట్టుకుంటోంది. సంజన ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All