Homeన్యూస్భీమ్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర కిన్నెర మొగిలయ్య ను ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు

భీమ్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర కిన్నెర మొగిలయ్య ను ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు

భీమ్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర కిన్నెర మొగిలయ్య ను ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు
భీమ్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర కిన్నెర మొగిలయ్య ను ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్ ముందు వరకు కిన్నెర మొగిలయ్య అంటే పెద్దగా ఎవరికీ తెలియదు..కానీ ఎప్పుడైతే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యిందో కిన్నెర మొగిలయ్య దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఎవరు ఈ కిన్నెర మొగిలయ్య అంటూ గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు. 12మెట్ల కిన్నెర కళలో ఆయన ఆఖరి తరం కళాకారుడు మొగిలయ్య . మొగిలయ్య జీవిత చరిత్రను ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు.

అయితే ఇంత జరిగినా కూడా మొగిలయ్య ఎవరో, ఆయన వాయించే పరికరం, ఆయనకున్న కళ ఏమిటో చాలా మందికి తెలియదంటే అందులో అతిశయోక్తి లేనే లేదు. అలాంటి మొగిలయ్యను ఒక్కసారిగా సెలబ్రిటీని చేసింది మాత్రం ‘భీమ్లా నాయక్’.  భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను ఈయనతో పాడించి థమన్ ఈయన్ను వైరల్ చేసారు.

- Advertisement -

ఈ సాంగ్ పెద్ద హిట్ కావడం..మొగిలయ్య పేరు మారుమోగిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. అంతే కాదు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలంగాణ రాష్ట్రం తరపున కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ‘పద్మశ్రీ’కి అవార్డు సైతం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయిల ఆర్ధిక సాయం చేసింది.  ప్రస్తుతం మొగిలయ్య  ఎక్కడికెళ్లినా అభిమానులు సెల్ఫీ ల కోసం పోటీ పడుతున్నారు.

తాజాగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర కూడా అదే జరిగింది. మొగిలయ్య  లోపలి వెళ్లే క్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు ఆయన చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఉక్కిరిబిక్కిరి చేసారు. దీంతో పోలీసులు అభిమానులను చెదరగొట్టి మొగిలయ్య ను లోపలి తీసుకెళ్లారు. ఇక వేదిక ఫై మొగిలయ్య ను చిత్ర యూనిట్ సన్మానించింది.  ఈ సందర్బంగా మొగిలయ్య మాట్లాడుతూ చిత్ర యూనిట్ కు , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు థాంక్స్ చెప్పుకున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All