Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ ఫై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు..

భీమ్లా నాయక్ ఫై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు..

భీమ్లా నాయక్ ఫై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు..
భీమ్లా నాయక్ ఫై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు..

మరోసారి పవన్ కళ్యాణ్ ఫై ఏపీ సర్కార్ కక్ష్య సాధింపు చేస్తుంది. పవన్ నటించిన గత చిత్రం వకీల్ సాబ్ విషయంలో టికెట్స్ ధరలు తగ్గించడం , థియేటర్స్ ఫై ఆకస్మిక తనిఖీలు చేయడం వంటివి చేసి కలెక్షన్లు తగ్గేలా చేయగా..ఇప్పుడు మరోసారి భీమ్లా నాయక్ విషయంలో అదే చేస్తుంది. రాష్ట్రంలో జీవో 35 ని తీసుకొచ్చి చిత్రసీమ ను దెబ్బ తీసింది. మొన్నటి వరకు చిత్రసీమ ప్రముఖులు పలుమార్లు భేటీలు ఏర్పటు చేసి తమ బాధలు చెప్పుకోగా..రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి రణగంలోకి దిగి జగన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం చిత్రసీమ కు గుడ్ న్యూస్ తెలుపుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్పారు.

దీంతో భీమ్లా నాయక్ రిలీజ్ సమయానికి ప్రభుత్వం టికెట్ ధరలు పెంచే అవకాశం ఇస్తుందని భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం అలాగే మొండిగా వ్యవహరిస్తోంది. మరో రెండు రోజుల్లో భీమ్లా నాయక్ రిలీజ్ అవుతున్న క్రమంలో థియేటర్స్ లలో తనిఖీలు చేయడం , బ్లాక్ టికెట్స్ అమ్మకూడదని హెచ్చరించడం, జీవో 35 ప్రకారం టికెట్ ధరలు విక్రయించాలని సూచించడం చేస్తుంది. అధికారులు తీరు పట్ల అభిమానులు , థియేటర్స్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కావాలనే పవన్ కళ్యాణ్ ను దెబ్బ తీయాలని ఇలా చేస్తుందని అంటున్నారు. విజయవాడ , కాకినాడ , వైజాగ్ , నరసాపురం, ఒంగోలు , నెల్లూరు తదితర ప్రాంతాలలో అధికారులు థియేటర్స్ లలో సోదాలు మొదలుపెట్టారు.

- Advertisement -

మరోపక్క తెలంగాణ లో కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాలపాటు ఐదు షో కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రకటన తో మేకర్స్ తో పాటు నైజాం డిస్టిబ్యూటర్స్ , థియేటర్స్ యాజమాన్యాలతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  ఇలా తెలంగాణ అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే..ఏపీ లో మాత్రం అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All