Homeటాప్ స్టోరీస్ముద్దులరెడ్డితో మహేష్ భామ లిప్ లాక్ కు రెడీ

ముద్దులరెడ్డితో మహేష్ భామ లిప్ లాక్ కు రెడీ

Kiara advani green signal to muddulareddyమహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన భామ కైరా అద్వానీ తాజాగా బాలీవుడ్ లో ముద్దులరెడ్డికి ప్రేయసిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది . తెలుగులో ప్రభంజనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి . టైటిల్ అర్జున్ రెడ్డి అయినప్పటికీ ఈ సినిమాకు మరో పేరు ముద్దులరెడ్డి . బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సిద్దమయ్యాడు సందీప్ రెడ్డి వంగా . హీరోగా షాహిద్ కపూర్ ని ఎంచుకున్నాడు అలాగే హీరోయిన్ గా తారా సుతారియా ని కూడా ఎంచుకున్నాడు కానీ ఆ భామ ముద్దులరెడ్డికి హ్యాండ్ ఇవ్వడంతో ఆ ఛాన్స్ కైరా అద్వానీకి వచ్చింది .

బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలకు దూరంగా ఉంటుందేమో , అలాంటి చిత్రాల్లో నటించదు అని అనుకుంటారు కైరా అద్వానీని చూస్తే ……. కానీ నేను దేనికైనా రెడీ అని ఓ వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించి ప్రేక్షకులతో పాటుగా సినిమావాళ్ళకు కూడా పిచ్చ షాక్ ఇచ్చింది కైరా అద్వానీ . షాహిద్ తో రొమాన్స్ కి రెడీ అవుతున్న ఈ భామ ముద్దులరెడ్డి తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి . అన్నట్లు మహేష్ బాబు సరసన నటించిన ఈ భామకు తెలుగులో కూడా పలు అవకాశాలు వచ్చి పడుతున్నాయి .

- Advertisement -

English Title: Kiara advani green signal to muddulareddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All