Homeటాప్ స్టోరీస్తమిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి

తమిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి

Tamil arjun reddy shooting completedతెలుగునాట సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళనాట రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది , షూటింగ్ పార్ట్ పూర్తికావడంతో ఆడియో వేడుక భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ తమిళ అర్జున్ రెడ్డి చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు , ఇక ఈ చిత్రానికి తమిళ్ లో పెట్టిన పేరు ” వర్మ ” . సంచలన దర్శకులు బాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . విక్రమ్ ని స్టార్ హీరోగా నిలబెట్టింది దర్శకులు బాల . అందుకే కృతజ్ఞతతో తన తనయుడిని కూడా అతడికే అప్పగించాడు విక్రమ్ .

ధృవ్ ఆమధ్య ఓ భారీ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నాడు , అయితే తమిళనాట విక్రమ్ స్టార్ హీరో కావడంతో ఆ కేసు రాజీ కుదిర్చారు పోలీసులు దాంతో కేసు లేకుండాపోయింది . మొత్తానికి షూటింగ్ పూర్తికావడంతో ఈ సినిమా విజయం పట్ల చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు ధృవ్ . విజయ్ దేవరకొండకు ఊహించని ఇమేజ్ ని ఇచ్చింది అర్జున్ రెడ్డి చిత్రం దాంతో తనకు కూడా అలాగే మరిచిపోని విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాడు ధృవ్ . అయితే సినిమా విడుదల అయితే కానీ తెలీదు తెలుగులాగే తమిళనాట కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా ? లేదా ? అన్నది .

- Advertisement -

English Title: Tamil arjun reddy shooting completed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All