Homeటాప్ స్టోరీస్అక్టోబర్ 1 నుండి హిందీ అర్జున్ రెడ్డి

అక్టోబర్ 1 నుండి హిందీ అర్జున్ రెడ్డి

Bollywood Arjun reddy shooting starts from october 1stతెలుగునాట సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్థానంలో షాహిద్ కపూర్ నటిస్తున్న విషయం కూడా విదితమే ! ఇక ఈ చిత్రం అక్టోబర్ 1 నుండి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు ప్రకటించారు దర్శకులు సందీప్ రెడ్డి వంగా . తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఈ బాలీవుడ్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనుండటం విశేషం . అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా తో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు పోటీపడ్డారు అయితే యితడు మాత్రం బాలీవుడ్ కెళ్తున్నాడు .

అక్టోబర్ 1 నుండి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాపై షాహిద్ కపూర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . హీరో క్యారెక్టరైజేషన్ బాగా నచ్చడంతో తన బెస్ట్ ఔట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని అంటున్నాడు షాహిద్ . ఇక తెలుగునాట ప్రభంజనం సృష్టించిన ఈ బోల్డ్ మూవీ బాలీవుడ్ లో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -

English Title: bollywood arjun reddy shooting starts from october 1st

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All