Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ని చేసుకునే అమ్మాయి ఎవరో

విజయ్ దేవరకొండ ని చేసుకునే అమ్మాయి ఎవరో

vijay devarakonda opens about his marriage29 సంవత్సరాల విజయ్ దేవరకొండ పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతున్నాడు . ఇంతకుముందు అయితే 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని కానీ ఇప్పుడు మాత్రం 30 – 35 ఏళ్ళ లో పెళ్లి చేసుకోవడం ఖాయమని కాకపోతే నాకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు తారసపడలేదని , ఒకవేళ నా మనసుకి నచ్చిన అమ్మాయి కనబడితే ఆంధ్రా , తెలంగాణ అనే బేధం ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు విజయ్ దేవరకొండ .

అంతేకాదు తనకు కాబోయే భార్య తో శారీరకమైన బంధం ని మాత్రమే కోరుకోవడం లేదని ఆమెతో ఉంటే బోర్ కొట్టకుండా ఉండాలని , కేవలం మేమిద్దరం మాత్రమే ఉన్నప్పటికీ …… ఎన్ని రోజులైనా సరే మాట్లాడుకుంటూ ఉండాలి కానీ ఏమాత్రం బోర్ అనిపించొద్దని అలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నానని , అంతేకాదు తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకునేది లేదని కుండబద్దలు కొట్టాడు . ప్రేమించి పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసాడు విజయ్ దేవరకొండ . అంటే విజయ్ దేవరకొండ పెళ్లి చూపులకు రెడీ అవుతున్నాడన్న మాట . విజయ్ దేవరకొండ ని పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో ? ఎక్కడ ఉందో మరి !

- Advertisement -

English Title: vijay devarakonda opens about his marriage

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All