Homeటాప్ స్టోరీస్ఏడాది పూర్తిచేసుకున్న అర్జున్ రెడ్డి

ఏడాది పూర్తిచేసుకున్న అర్జున్ రెడ్డి

vijay deverakondas arjun reddy completes one yearవిజయ్ దేవరకొండ కెరీర్ ని పీక్స్ కి తీసుకెళ్లిన చిత్రం ” అర్జున్ రెడ్డి ” . కాగా ఆ సినిమా విడుదలై నేటికీ సరిగ్గా ఏడాది పూర్తిచేసుకుంది . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపుతిప్పింది అంతేకాదు తెలుగు సినిమాకు సరికొత్త గమనాన్ని చూపించింది . గత ఏడాది ఆగస్టు 25 న విడుదలైన అర్జున్ రెడ్డి ప్రభంజనం సృష్టించింది . కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం వసూళ్ల సునామీ సృష్టించి విజయ్ దేవరకొండ ని స్టార్ ని చేసింది .

ఈ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తికావడంతో అప్పుడే ఏడాది పూర్తయ్యిందా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తన సినిమా ఘనవిజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతఙ్ఞతలు అంటూ ట్వీట్ చేసాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా , ఇక విజయ్ దేవరకొండ కూడా కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేసాడు కూడా అంతేకాదు అసలు అర్జున్ రెడ్డి సినిమా కోసం మేము తీసుకున్న మొదటి లుక్ ఇదే అంటూ గడ్డం బాగా పెంచి , చేతికి రక్తం ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో పెట్టాడు . 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి 51 కోట్ల వసూళ్ల ని సాధించి సంచలనం సృష్టించింది . వసూళ్లు మాత్రమే కాదు , రీమేక్ రైట్స్ , డిజిటల్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా భారీ మొత్తం లో డబ్బులు వచ్చాయి . అర్జున్ రెడ్డి ఏడాది పూర్తిచేసుకోవడంతో ఆ చిత్ర బృందం సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది .

- Advertisement -

English Title: vijay deverakondas arjun reddy completes one year

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All