Homeటాప్ స్టోరీస్వినాయక చవితి స్పెషల్ గా ఖిలాడీ ఫస్ట్ సింగిల్

వినాయక చవితి స్పెషల్ గా ఖిలాడీ ఫస్ట్ సింగిల్

వినాయక చవితి స్పెషల్ గా ఖిలాడీ ఫస్ట్ సింగిల్
వినాయక చవితి స్పెషల్ గా ఖిలాడీ ఫస్ట్ సింగిల్

మాస్ మహారాజా రవితేజ లీడ్ రోల్ లో నటిస్తోన్న తాజా చిత్రం ఖిలాడీపై డీసెంట్ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరొక పాటను షూట్ చేస్తే మొత్తం పూర్తవుతుంది. ఇదిలా ఉంటే వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు.

మొదటి పాట ఇష్టంను సెప్టెంబర్ 10న ఉదయం 10:08 నిమిషాలకు విడుదలవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్న ప్రోమో బిట్ ను వదిలారు. అందులో పాట బీట్ తో పాటు రవితేజ తనదైన స్టైల్ లో చేస్తోన్న డ్యాన్స్ బిట్ ను కూడా జోడించారు. ప్రోమో చూస్తుంటే ఖిలాడీ నుండి చార్ట్ బస్టర్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లుంది.

- Advertisement -

రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. త్వరలోనే ఖిలాడీ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All