Homeటాప్ స్టోరీస్దీపావళి రిలీజ్ కు గురిపెట్టిన ఖిలాడీ

దీపావళి రిలీజ్ కు గురిపెట్టిన ఖిలాడీ

దీపావళి రిలీజ్ కు గురిపెట్టిన ఖిలాడీ
దీపావళి రిలీజ్ కు గురిపెట్టిన ఖిలాడీ

మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రం ద్వారా ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ ను అందుకుని ఫామ్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రవితేజ చేస్తోన్న చిత్రం ఖిలాడీ. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. కేవలం మరికొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని మొదట మే చివర్లో విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా నేపథ్యంలో సాధ్యపడలేదు.

తాజా సమాచారం ప్రకారం ఖిలాడీ చిత్రాన్ని దీపావళి స్పెషల్ గా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ లు అవుతున్నాయి. పరిస్థితులు చక్కబడుతుండడంతో చిత్రాలు విడుదలకు సముఖంగా ఉన్నాయి. సో, ఖిలాడీకి ఓటిటి ఆఫర్లు వచ్చినా కానీ థియేట్రికల్ రిలీజ్ వైపే మొగ్గు చూపారు.

- Advertisement -

రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్, అనసూయ వంటి ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమా కాకుండా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటున్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All