Homeటాప్ స్టోరీస్`కేజీఎఫ్` డైరెక్ట‌ర్ స్టోరీతో `బ‌గీరా`!

`కేజీఎఫ్` డైరెక్ట‌ర్ స్టోరీతో `బ‌గీరా`!

`కేజీఎఫ్` డైరెక్ట‌ర్ స్టోరీతో `బ‌గీరా`!
`కేజీఎఫ్` డైరెక్ట‌ర్ స్టోరీతో `బ‌గీరా`!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`తో ప్ర‌శాంత్ నీల్ ఇండియా వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు. మోస్ట్ వాండెడ్ డైరెక్ట‌ర్‌ల జాబితాలో చేరిపోయారు. ప్ర‌స్తుతం `కేజీఎఫ్‌`కు సీక్వెల్‌ని తెర‌కెక్కిస్తున్న ఆయ‌న జ‌న‌వ‌రి నుంచి ప్ర‌భాస్ హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ `స‌లార్‌`ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఆడిష‌న్స్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. ఇదిలా వుంటే ప్ర‌శాంత్ నీల్ ఓ చిత్రానికి క‌థ అందిస్తున్నారు.

దీనికి `భ‌గీరా` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు.. క‌న్న‌డ హీరో శ్రీ‌ముర‌ళి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి డీఆర్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `కేజీఎఫ్‌`, స‌లార్ చిత్రాల నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరో శ్రీ‌ముర‌ళి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఫ‌స్ట్ లుక్‌లో ఎనిమ‌ల్ హ్యాండ్ బ్లాక్ ప‌ర‌దాని చించేస్తుండ‌గా అందులోంచి హీరో వైల్డ్‌గా కనిపిస్తున్న తీరు ఇంట్రెస్టింగ్‌గా వుంది.

- Advertisement -

`స‌మాజం ఒక్క‌సారిగా జంగ‌ల్‌గా మారిపోతే న్యాయం కోసం ఒకే ఒక్క ప్రెడేట‌ర్ గ‌ర్జిస్తాడు` అని పోస్ట‌ర్ పై వున్న క్యాప్ష‌న్ సినిమా పై అంచ‌నాల్ని పెంచేస్తోంది. మ‌రోసారి ప్ర‌శాంత్ నీల్ యాక్ష‌న్ డ్రామానే న‌మ్ముకున్న‌ట్టు తెలుస్తోంది. ఫ‌స్ట్ లుక్‌తో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All