Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్ `స‌లార్‌` షూట్ మొత్తం అక్క‌డే!

ప్ర‌భాస్ `స‌లార్‌` షూట్ మొత్తం అక్క‌డే!

ప్ర‌భాస్ `స‌లార్‌` షూట్ మొత్తం అక్క‌డే!
ప్ర‌భాస్ `స‌లార్‌` షూట్ మొత్తం అక్క‌డే!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ ప్ర‌స్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ మూడు పాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ మూడు చిత్రాల్లో `కెజిఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో `స‌లార్‌` మూవీని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌గానే ఈ ప్రాజెక్ట్ పరిశ్రమ వర్గాలల్లో చర్చనీయాంశంగా మారింది.

అత్య‌త భారీ స్థాయిలో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని `కేజీఎఫ్‌` మేక‌ర్స్ హోంబ‌లే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందుర్ నిర్మించ‌నున్నారు. ప్ర‌భాస్ డాన్‌గా స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిప ప్ర‌భాస్ లుక్ సినిమాపై భారీ అంచ‌నాల్నిపెంచేసింది. పాన్ ఇండియా స్థాయిలో హాలీవుడ్ చిత్రాల స్థాయికి ఏ మాత్రం తీసిపోని విధంగా మేకింగ్ వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ని జ‌న‌వ‌రి నుంచి ప్రారంభించ‌బోతున్నారు.

- Advertisement -

అత్య‌ధిక భాగం హైదరాబాద్, బెంగళూరులలో చిత్రీకరించబోతున్నార‌ట‌. దర్శకుడు ప్రశాంత్ ఈ రెండు నగరాల్లో ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`ని పూర్తి చేసే ప‌నిలో వున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

ఈ మూవీ కోసం ఈ నెల 15న హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆడిషన్ జరగబోతోంది. ఈ ఆడిష‌న్‌లో అన్ని వ‌య‌సుల వారు పాల్గొనాల‌ని చిత్ర బృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. హైదరాబాద్ తరువాత బెంగ‌ళూరు, చెన్నైలలో కూడా ఆడిషన్ జరగబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All