Homeటాప్ స్టోరీస్కేజిఎఫ్ 2 సౌత్ సాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జీ సంస్థ

కేజిఎఫ్ 2 సౌత్ సాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జీ సంస్థ

కేజిఎఫ్ 2 సౌత్ సాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జీ సంస్థ
కేజిఎఫ్ 2 సౌత్ సాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జీ సంస్థ

కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 1 ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అన్ని ఇండస్ట్రీల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఈ చిత్రం. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కింది. కేజిఎఫ్ చాప్టర్ 2 జులైలోనే విడుదల కావాలి కానీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విడుదలను వాయిదా వేశారు.

కేజిఎఫ్ చాప్టర్ 2 మరింత భారీ రేంజ్ లో ఉంటుంది అని ఇప్పటికే హింట్స్ వచ్చాయి. దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రం కోసం మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర సాటిలైట్ హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జీ స్టూడియోస్ సాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

- Advertisement -

రవీనా టాండన్, రావు రమేష్, సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. హోంబేలె ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం మొత్తం ఐదు భాషల్లో ఈ ఏడాది విడుదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All